దిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ కేంద్రంలో 2025, అక్టోబరు 1న జరిగిన ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ పేరిట ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. స్మారక రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. దానిపై ఓవైపు రూ.100 సంఖ్య, జాతీయచిహ్నం.. మరోవైపు సింహాన్ని ఆనుకుని అభయ ముద్రలో ఉన్న భరతమాతకు వందన సమర్పణ చేస్తున్న స్వయం సేవకులతో కూడిన చిత్రం ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశీయ కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ తెలిపారు.