ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమైన 9 రాష్ట్రాలకు రూ.4,645.60 కోట్ల విలువైన రికవరీ, రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. 2025, అక్టోబరు 1న దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి (ఎన్‌డీఎంఎఫ్) నుంచి విశాఖపట్నం సహా దేశంలోని 11 ప్రధాన నగరాలకు అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం-ఫేజ్-2 కింద రూ.2,444.42 కోట్ల నిధులు కేటాయించడానికి ఆమోదం తెలిపింది.