ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్‌ను ప్రభుత్వం 2025, అక్టోబరు 13న ప్రారంభించింది. ప్రైవేట్ సంస్థలు వినియోగదారుల ఇంటి వద్దకే సకాలంలో సేవలను అందించేలా, మౌలిక సదుపాయాల ఆధారిత అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో ప్రవేట్ రంగానికి సహాయపడేలా దీన్ని తీసుకొచ్చారు. ఈ పోర్టల్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ నుంచి ఎంపికచేసిన నాన్-సెన్సిటివ్ డేటా సెట్‌లకు నియంత్రిత యాక్సెస్‌ను అందిస్తుంది. రవాణా ఖర్చులను తగ్గించి మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా 2021 అక్టోబర్‌లో పీఎం గతిశక్తిని ప్రారంభించారు.