నీతి ఆయోగ్ మాజీ వైస్‌ఛైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నెలరోజులపాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 11న ఆమోదం తెలిపారు. 2023 డిసెంబరు 31న ఏర్పాటైన ఈ సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి పంపిణీ చేయాల్సిన ఆర్థిక వనరులపై సెప్టెంబరు 31వ తేదీలోపు రాష్ట్రపతికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అది కాస్త జాప్యం కానున్న నేపథ్యంలో కమిషన్ గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.