దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 11న పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు. రూ.24 వేల కోట్లతో చేపట్టే ధనధాన్య యోజన కింద 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపుతోపాటు పశుసంవర్ధకంపైనా ఇందులో దృష్టిసారిస్తామని చెప్పారు.