పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడానికి రూ.60 వేల కోట్లతో పీఎం సేతు (ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 4న ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు 400 నవోదయ, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,200 వృత్తి విద్య నైపుణ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసే పథకానికీ శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.