హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవావరణానికి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈశాన్య హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించింది ఉంది. దట్టమైన మంచుతో నిండిన లోయలు, అత్యంత ఎత్తైన ప్రదేశంలో సరస్సులు, మిట్టపల్లాలతో అతిశీతల గాలులు వీచే కఠిన వాతావరణ పరిస్థితులుండే సుందర ప్రదేశం ఇది.
2025, సెప్టెంబరు 27న పారిస్‌లో జరిగిన యునెస్కోకు చెందిన ‘మ్యాన్ అండ్ ద బయోస్పియర్’ (ఎంఏబీ) అంతర్జాతీయ సమన్వయ సమితి 37వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.