బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా దిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ నియమితుడయ్యాడు. 2025, సెప్టెంబరు 28న ముంబయిలో జరిగిన 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో అతడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 70 ఏళ్లు నిండటంతో నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన రోజర్ బిన్నీ స్థానంలో మిథున్ నియమితులయ్యారు. దీంతో వరుసగా మూడోసారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన వ్యక్తి బోర్డు పగ్గాలు చేపట్టినట్లయింది.