తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన (ఎల్‌సీఏ) తేజస్‌లను కొనుగోలు చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రక్షణశాఖ 2025, సెప్టెంబరు 25న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 ఎంకే1ఏ విమానాలను హెచ్‌ఏఎల్ అందించనుంది. ఇందులో ఫైటర్ జెట్లు 68, శిక్షణకు వినియోగించే రెండు సీట్ల విమానాలు 29 ఉన్నాయి.
2027-28 నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది. ఆరేళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందుతాయి.