రాడార్ గుర్తించలేని అయిదోతరం అత్యాధునిక యుద్ధవిమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్‌కా) స్టెల్త్ జెట్ ప్రోటోటైప్ రూపకల్పన కోసం, హైదరాబాద్‌కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్‌తో అదానీ గ్రూప్ జట్టు కట్టింది. ఆమ్కా ప్రోటోటైప్ నిర్మాణం కోసం దేశీయంగా హెచ్‌ఏఎల్, ది కల్యాణీ గ్రూప్, టాటా, అదానీ, ఎల్ అండ్‌టీ సహా మొత్తం 7 సంస్థలు ఆసక్తి చూపాయి.