భారత్, బ్రిటన్ నౌకాదళాలు హిందు మహాసముద్రంలో ‘కొంకణ్’ పేరుతో భారీ యుద్ధవిన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మెరుగుపరచుకోవడం వీటి ఉద్దేశం. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌కు చెందిన విమానవాహకనౌక హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నేతృత్వంలో యుద్ధనౌకలు, భారత్ తరఫున ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఇతర యుద్ధనౌకలు పాల్గొన్నాయి.
2025, అక్టోబరు 5న ప్రారంభమైన ఈ విన్యాసాలు అక్టోబరు 12 వరకూ సాగుతాయి.