రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) ‘ధ్వని’ని రూపొందిస్తోంది. 2025 చివరి నాటికి ఈ అస్త్రానికి సంబంధించిన పరీక్షలను పూర్తిచేయాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణి భీకరంగా పనిచేస్తుందని అంచనా.
ధ్వని కంటే అయిదారు రెట్లు వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం హెచ్‌జీవీల సొంతం. గంటకు 7వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డీఆర్‌డీవో వీటిని రూపొందిస్తోంది. 1500 నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని అంచనా.