దేశంలోని 22 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్నాలజీ), ఎంఎస్(రిసెర్చ్), ఎంఎస్సీ ఎంటెక్, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ (డ్యూయల్ డిగ్రీ) కోర్సుల్లో 3,000 సీట్ల భర్తీకి నిర్వహించే ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2026)’కు నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2026)
అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల వివరాలు: మొత్తం మూడు వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సబ్జెక్టులు: ఏడు సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్. వీటిలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్-1లో ఒకటి, సెషన్-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్-1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో.. బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ల్లో ఇవి ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కి రూ.1,000 రెండు పేపర్లకు రూ.1,350. మిగిలిన అభ్యర్థులు అందరికీ ఒక పేపర్‌కు రూ.2,000. రెండు పేపర్లకు రూ.2,700
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, ఒంగోలు, తిరుపతి. ముఖ్య తేదీలు...
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 05-09-2025.
రిజిస్ట్రేషన్ గడువు: 12-10-2025
పరీక్ష తేదీ: 15-02-2026.
ఫలితాల ప్రకటన: 18-03-2026.
Website: https://jam2026.iitb.ac.in/#