అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం ప్రగతి స్కాలర్‌షిప్, సాక్షం స్కాలర్‌షిప్, స్వనాథ్ స్కాలర్‌షిప్ కింద కొత్త, పునరుద్ధరణ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా 50,000 వరకు ఉపకార వేతనాన్ని పొందవచ్చు. దరఖాస్తులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా సమర్పించాలి. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు దరఖాస్తుకు అర్హులే.
వివరాలు:
ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్: ఏఐసీటీఈ గుర్తించిన డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం.
ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ స్కీమ్: కనీసం 40% వికలాంగత కలిగిన విద్యార్థులు (డిగ్రీ/డిప్లొమా).
ఏఐసీటీఈ స్వనాథ్ స్కాలర్‌షిప్ స్కీమ్: అనాథలు, వీరమరణం పొందిన సాయుధ దళాల సైనికుల పిల్లలు, కొవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు.
అర్హతలు: ఏఐసీటీఈ గుర్తించిన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం ఉండాలి. ఒక కుటుంబానికి గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు మాత్రమే అర్హులు. సాక్షంకు కనీసం 40% వికలాంగత సర్టిఫికెట్ అవసరం.
* కుటుంబ ఆదాయ పరిమితులు, విద్యార్హతలు ఇతర షరతులు ఏఐసీటీఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటాయి.
వయోపరిమితి: డిగ్రీ/డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు 17 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. సాక్షం, స్వనాథ్ కేటగిరీలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి.
దరఖాస్తుకు కావలసిన ధ్రువపత్రాలు: ఆధార్ నంబర్, కుటుంబ ఆదాయ సర్టిఫికెట్, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశ రుజువు, వికలాంగత సర్టిఫికెట్, అనాథ/స్వనాథ్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్, ఆధార్-లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తదితరాలు.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (https://scholarships.gov.in) లో ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు సరిగా సమర్పించాలి. మొదట ఇన్‌స్టిట్యూట్ స్థాయి, తరువాత రాష్ట్ర నోడల్ ఆఫీసర్ స్థాయి ధ్రువీకరణ జరుగుతుంది.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.10.2025
ఇన్‌స్టిట్యూట్ (INO) వెరిఫికేషన్: 15.11.2025
రాష్ట్ర నోడల్ ఆఫీసర్ (SNO) వెరిఫికేషన్: 30.11.2025
Website: https://www.aicte.gov.in/index.php/