రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత 1945, అక్టోబ‌రు 25న ఐక్య‌రాజ్యస‌మితి ఏర్ప‌డింది. దీని ఏర్పాటుకు అట్లాంటిక్ చార్ట‌ర్ కార‌ణం.

యునైటెడ్ నేష‌న్స్ అనే ప‌దాన్ని 1942లో అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్‌ సూచించారు. ప్ర‌ధాన కార్యాల‌యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.

ప్ర‌స్తుతం ఇందులో 193 స‌భ్య‌దేశాలు ఉన్నాయి. భార‌త్ 1945 నుంచి ఇందులో స‌భ్య‌దేశంగా కొన‌సాగుతోంది. వాటిక‌న్ సిటీ, తైవాన్‌ల‌కు ఇందులో స‌భ్యత్వం లేదు.

ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ తొలి స‌మావేశం 1946, జ‌న‌వ‌రి 10న లండ‌న్‌లో జ‌రిగింది. సాధార‌ణ స‌భ‌కు అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించిన తొలి భార‌తీయ మ‌హిళ విజ‌య‌ల‌క్ష్మి పండిట్ (1953-54).

ఐక్య‌రాజ్య‌స‌మితి అధికార భాష‌లు ఆరు. అవి: ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, అర‌బిక్‌, స్పానిష్‌, చైనీస్‌, రష్యన్.

ఐక్య‌రాజ్య‌స‌మితి జెండాను 1947, అక్టోబ‌రు 20న సాధార‌ణ స‌భ ఆమోదించింది. జెండా పొడ‌వు, వెడ‌ల్పులు 3 : 2.

ఐక్య‌రాజ్య‌స‌మితికి మొద‌టి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా నార్వేకి చెందిన ట్రిగ్వేలి (1946-53) వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుత సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ 2017 నుంచి కొన‌సాగుతున్నారు.

Epratibha.net Home