​​క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన క్లాసికల్‌ కంప్యూటర్‌లకు కూడా అందుబాటులో లేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్‌ మెకానిక్స్‌ ద్వారా పరిష్కరించవచ్చు. ఔషధాల ఆవిష్కరణ నుంచి మెటీరియల్‌ సైన్స్‌ వరకూ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించి శాస్త్రీయ పురోగతిని వేగవంతం చేస్తుంది.

​​ఏఐ, జెన్‌ ఏఐ

ఆధునికకాలంలో సంస్థలు ఏఐని అనుసరించడం తప్పనిసరైంది. ప్రస్తుతం జెన్‌ ఏఐ కూడా తోడవడం వల్ల పనుల్లో వేగం, సౌలభ్యం మరింత పెరిగాయి. ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలనుకునే విద్యార్థులు, నిపుణుల కోసం చాలా అవకాశాలు ఉన్నాయి.

జీనోమిక్స్‌

వ్యక్తిగత వైద్య సేవలకు జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ ఉపయోగపడుతుంది. 2030 నాటికి చాలామంది వ్యక్తిగత వైద్యుల సేవలకు మొగ్గు చూపుతారని అంచనా. వ్యక్తిగతంగా పెరుగుతున్న అవసరాలు, వ్యక్తిగతీకరించిన సూచనలు భవిష్యత్తును నడిపిస్తాయి.

6 జీ నెట్‌వర్క్‌

6 జీ రాకతో గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు అనూహ్యమైన వేగం, తక్షణ కనెక్టివిటీతో ఇంటర్నెట్‌ సౌకర్యం సాధ్యమవుతుంది. సెకన్ల వ్యవధిలో సినిమా డౌన్‌లోడింగ్, నిరంతర వర్చువల్‌ రియాలిటీ అనుభూతి మొదలైనవన్నీ చేయొచ్చు. టెక్నికల్‌ రంగంలో ఇది విప్లవాత్మక ధోరణిగా మారుతోంది.

రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ)

కృత్రిమ మేధతో కూడిన ఆర్‌పీఏలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పునరావృతమయ్యే పనులు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ ద్వారా ఎక్కువగా ఆటోమేట్‌ అవుతాయి. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికీ, ఉత్పాదకతను పెంచడానికీ, ఖర్చులను తగ్గించడానికీ ఆర్‌పీఏను ఉపయోగించడం పెరుగుతుంది.

స్మార్ట్‌ పరికరాలు

మనం వాడే పరికరాలు మరింత స్మార్ట్‌గా మారుతున్నాయి. ఆకర్షణీయమైన స్మార్ట్‌ హోమ్‌లు, స్మార్ట్‌ పరికరాలు అధిక భద్రతతో మన భవిష్యత్తును సురక్షితంగా ఉండేలా చేస్తున్నాయి. ఈ దిశగా నిరంతరం పరిశోధనలు కొనసాగుతాయి.

డేటాఫికేషన్‌

డేటాఫికేషన్‌ అంటే మన ఆలోచనలూ, ఇంటర్నెట్‌ హబ్‌లో చూసే ఫలితాలూ. సోషల్‌ మీడియా కార్యకలాపాల నుంచి హెల్త్‌ ట్రాకర్ల వరకూ మన జీవితంలోని ప్రతి అంశమూ డేటాగా రూపొందుతోంది. ఏ ఒక్క వినియోగదారుడ్నీ వదులుకోకూడదనే సంస్థల ప్రధాన లక్ష్యం డేటాఫికేషన్‌తో నెరవేరుతోంది.

3 డీ ప్రింటింగ్‌

3డీ ప్రింటింగ్‌ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోగులకు ఎనలేని సహాయం చేస్తోంది. కస్టమ్‌ ప్రోస్తటిక్స్‌ నుంచి సంక్లిష్టమైన పారిశ్రామిక భాగాల వరకూ ప్రతిదీ ముద్రించడం సాధ్యపడుతోంది.

డిజిటల్‌ ట్రస్ట్‌ అండ్‌ సెక్యూరిటీ

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో దేన్ని నమ్మాలి, దేన్ని విశ్వసించకూడదనే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత లావాదేవీల కోసం సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల్లో పురోగతి అవసరం. దీనికోసం ఎథికల్‌ ఏఐ ఫ్రేమ్‌వర్క్స్‌ను వినియోగించవచ్చు.

న్యూ ఎనర్జీ సొల్యూషన్స్‌

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సుస్థిర లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఫ్యూజన్‌ పవర్, అధునాతన సోలార్‌ ప్యానెల్‌లు, సమర్థవంత‌మైన శక్తి నిల్వ వ్యవస్థలు లాంటివాటికి ప్రాముఖ్యం పెరుగుతుంది. పునరుత్పాదక ఇంధన సాంకేతికతల్లో పురోగతి ఉంటుంది.

డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ

డిజిటల్‌ ట్విన్‌ (డీటీ) అనేది వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) కంటే మించి పనిచేసే పద్ధతుల్లో ఒకటి. దీన్ని ప్రిడిక్టివ్‌ మెయింటెనెన్స్‌కూ, ఆప్టిమైజ్‌ ఆపరేషన్లకూ, సిబ్బందికి సురక్షితమైన అనుకరణ (సిమ్యులేటెడ్‌) వాతావరణంలో శిక్షణ ఇవ్వడానికీ ఉపయోగించవచ్చు.

ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌)

ఇది విద్య, వినోదరంగాల్లో గొప్ప సాంకేతికత. ప్రజలకు చేరువయ్యేలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ అత్యుత్తమ సేవలు విస్తరిస్తూనే ఉన్నాయి.

Epratibha.net Home