​​ మీకు తెలుసా?

​​ కంగారూ ఎలుక‌లు

కంగారూ ఎలుక‌లు త‌మ జీవిత‌కాలంలో ఒక్క‌సారి కూడా నీటిని తాగ‌వు. ఇవి అమెరికాలోని నైరుతి ఎడారుల్లో జీవిస్తాయి. వీటి ఆకారం చిన్న సైజు కంగారూల‌ను పోలి ఉంటుంది. అందుకే వీటికి కంగారూ ఎలుక అని పేరు వ‌చ్చింది.

​​కివి ప‌క్షి

ప్ర‌పంచంలో రెక్క‌లు లేని ప‌క్షి కివి. ఇది న్యూజిలాండ్‌లో మాత్ర‌మే ఉంటుంది. ఇది ఆ దేశ అధికార చిహ్నం కూడా.

​​నార్వే జాతీయ జెండా

నార్వే జాతీయ జెండాలో ఆరు దేశాల జెండాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. అవి: నెద‌ర్లాండ్స్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్, పోలాండ్‌, థాయ్‌లాండ్‌.

​​కాస్మిక్ లాట్

విశ్వానికి ఉండే సగటు రంగును 'కాస్మిక్ లాట్' అంటారు. 2002లో ఖగోళ శాస్త్రవేత్తలు జ‌రిపిన‌ అధ్యయనంలో గెలాక్సీల నుంచి వచ్చే కాంతి తెల్లగా ఉండే లేత గోధుమరంగు రంగులోకి మారుతుందని తెలిసింది.

​​చీమ‌లు

చీమలకు ఊపిరితిత్తులు ఉండ‌వు. వాటి శ‌రీరంపై స్పిరకిల్స్ అని పిలిచే చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిద్వారా అవి ఆక్సిజ‌న్‌ను తీసుకుంటాయి. అదే రంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి.