జాతీయ డెంగ్యూ డే

జాతీయ డెంగ్యూ డే

మానవులకు సంక్రమించే అత్యంత తీవ్రమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక ఉష్ణమండల వ్యాధి (tropical disease). ఇది డెంగ్యూ వైరస్‌ వల్ల సంభవిస్తుంది. ఇదొక అంటువ్యాధి. ప్రస్తుతం ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ, అనేక దేశాల్లో దీని బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ప్రకారం మన దేశంలో ఏటా మే 16న ‘జాతీయ డెంగ్యూ దినోత్సవం’గా (National Dengue Day) నిర్వహిస్తారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ప్రభావాలు

  • డెంగ్యూ వ్యాధి వల్ల రక్తఫలకికల (ప్లేట్‌లెట్స్‌) సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.
  • కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.
  • తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, చర్మం మీద మచ్చలు రావడం లాంటివి సంభవిస్తాయి.
  • డెంగ్యూ జర్వంలో అందరికీ ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సిన అవసరం లేదు. వీటి సంఖ్య లక్ష కంటే తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. 50వేల కంటే దిగువకు పడిపోతే ఆసుపత్రిలో చేరి, ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా సంఖ్య తెలుసుకుంటూ ఉండాలి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేల కంటే తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే బయటి నుంచి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తుంది. అదే 10వేలకు పడిపోతే రక్తస్రావం ఉన్నా, లేకపోయినా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి. 

చారిత్రక నేపథ్యం

డెంగ్యూ వైరస్‌ ప్రధానంగా ఏడిస్‌ ఈజిప్టై దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. నిలిచి ఉన్న నీరు, అపరిశుభ్ర పరిసరాల్లో ఈ దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వీటి విజృంభణ అధికంగా ఉంటుంది. అందుకే దేశంలో రుతుపవనాల ప్రారంభానికి ముందే దోమల నియంత్రణ, నివారణ చర్యలతోపాటు డెంగ్యూ వ్యాధిని అరికట్టడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ 2010, మే 16న మొదటిసారి ‘నేషనల్‌ డెంగ్యూ డే’ను నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు.

డెంగ్యూ - సంక్రమణ, ప్రపంచవ్యాప్త గణాంకాలు, జాతీయ వాహక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం తదితర సమాచారంతోపాటు గత పోటీ పరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్, జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే కీలక అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మన దేశంలో ‘నేషనల్‌ డెంగ్యూ డే’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

1) మే 14       2) మే 15        3) మే 16   4) మే 17

సమాధానం: 3

2. డెంగ్యూ కింది దేనివల్ల సంక్రమిస్తుంది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2022)

1) వైరస్‌లు    2) శిలీంద్రాలు        3) బ్యాక్టీరియా  4) నెమటోడా

సమాధానం: 1

3. Dengue virus causes high fever, rashes and reduces the number of a particular type of blood cells. Those blood cells are
(NDA 2017)
1) Monocytes         2) Platelets        3) Eosinophils     4) Neutrophils
Ans: 2
4. As per the National Vector Borne Disease Control Program (NVBDCP), which of the following is/are not included in supportive interventions?
i. Indoor Residual Spraying (IRS)
ii. Long Lasting Insecticidal Nets (LLINs)
iii. Behaviour Change Communication (BCC)
iv. Inter-sectoral convergence
(BTSC ANM 2024)
1) i and ii only                2) i, ii and iii only     
3) ii, iii and iv only         4) ii and iv only
Ans: 1
5. Which of the following diseases are part of NVBDCP? 
i. Malaria 
ii. Kala-Azar
iii. Japanese Encephalitis
iv. Plague
v. Tuberculosis
Choose the correct answer from the options given below:
(Rajasthan Staff Nurse 2024)
1) i and ii only                2) i, ii and iii only        
3) i, ii, iii and iv only       4) i, ii, iii, iv and v
Ans: 2
6. Which program aims to eradicate Foot and Mouth Disease (FMD) and Brucellosis in livestock.
(NABARD Grade A, 2022)
1) Pradhan Mantri Matsya Sampada Yojana
2) National Animal Disease Control Programme (NADCP)
3) National Vector Borne Disease Control Programme (NVBDCP) 
4) Animal Husbandry Development Fund
5) Integrated Disease Surveillance Programme (IDSP)
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram