అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. వ్యక్తులు తాము మాట్లాడే భాష, ప్రవర్తనా సరళి, సామాజిక నియమాలు మొదలైనవన్నీ దీన్నుంచే నేర్చుకుంటారు. అంతేకాకుండా సమాజంలో బాధ్యతాయుతంగా మెలిగేందుకు కావాల్సిన శిక్షణ కుటుంబం నుంచే లభిస్తుంది. ప్రతి వ్యక్తి ఎదుగుదలలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని (International Day of Families) నిర్వహిస్తారు. కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

కుటుంబం అంటే?

  • ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహమే కుటుంబం. వీరి మధ్య వైవాహిక, రక్త సంబంధాలు ఉంటాయి. దీన్ని ఒక విశిష్ట సంస్థగా నిర్వచిస్తారు.  
  • మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ, అయితే దీనికి పునాది వివాహం. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. ఎందుకంటే భూమిపై ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. మన జీవితం మొత్తం కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది.
  • కుటుంబాన్ని ఇంగ్లిష్‌లో Family అంటారు. ఇది ఫాములస్‌ (Famulus) అనే రోమన్‌ పదం నుంచి వచ్చింది. దీని అర్థం సేవకుడు. అయితే Family అనే పదం ఫెమీలియా (Familiya) అనే లాటిన్‌ పదం నుంచి ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫెమీలియా అంటే కుటుంబం.  
  • కుటుంబాలు అనే భావన గురించి మొదట చెప్పినవారు అరిస్టాటిల్, ప్లేటో.
  • ఏంగెల్స్, కార్ల్‌మార్క్స్, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబాన్ని మానవ పరిణామక్రమంలో బలపడిన బంధంగా పేర్కొన్నారు.

ప్రముఖుల కోణంలో..  

మెకైవర్‌ (MacIver): పిల్లల్ని కనడం, పెంచడం, విధులను నిర్వహించడానికి, స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం. 

రీమాండ్‌ఫర్‌: ఈయన కుటుంబానికి త్రికోణ స్వరూపాన్ని ఇచ్చారు. ఈ నమూనాలో ఒకవైపు భర్త, మరోవైపు భార్య, మూడో వైపు వారి సంతానం ఉంటుంది.

బర్గస్, లాక్‌: వివాహబంధం, రక్తసంబంధం లేదా దత్తతతో ఏకమై ఒకే ఇంటిలో నివసించేదే కుటుంబం.

ఐరావతి కార్వే: ఒకే ఇంట్లో నివసిస్తున్న, ఒకే వంటగదిలో చేసిన ఆహారాన్ని తింటూ, ఒకే ఆస్తిని కలిసి అనుభవిస్తూ కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొంటూ, ఒకరికొకరు బంధువులయ్యే వ్యక్తుల సమూహమే ఉమ్మడి కుటుంబం.

కుటుంబం - రకాలు, భారతదేశ కుటుంబ వ్యవస్థ - గణాంకాలు లాంటి పూర్తి సమాచారంతోపాటు ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్‌ తదితర పోటీ పరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్, జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే కీలక అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025)

1) మే 12           2) మే 18

3) మే 10           4) మే 15

సమాధానం: 4

2. ఒక ఇంట్లో తండ్రికి అత్యున్నత హోదా ఉండి, కుటుంబ సామాజిక జీవితాన్ని నియంత్రించే స్థాయిలో ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు?

(యూపీఎస్సీ ఈఎస్‌ఐసీ నర్సింగ్‌ ఆఫీసర్, 2024)

1) పితృస్వామ్య కుటుంబం    2) మాతృస్వామ్య కుటుంబం

3) పితృస్థానీయ కుటుంబం   4) మాతృస్థానీయ కుటుంబం

సమాధానం: 1

3. Which one of the following statements regarding family is incorrect? 
(Bihar Sakshamta Pariksha 2024)
1) Family is the basic unit of society 
2) Family is the first place where child begins to learn and receive early education
3) Family is mini society for child and here child learn about socialisation by observation 
4) Family may be bound by force and it may exist without love and respect 
Ans: 4 
4. What is a family?
(UP TGT Home Science 2009)
1) A group        2) A community        3) A social organization        4) A crowd
Ans: 3
5. Which of the following purposes have been served by family as a social institution?
A. It socializes children.
B. It provides practical and emotional support for its members.
C. It establishes a goal of social equality.
D. It regulates sexual reproduction.
E. It provides its members with a social identity.
Choose the correct answer from the options given below:
(UGC NET (Education) Official 2023)
1) A, C, D and E only            2) A, B, D and E only
3) B, C and D only                4) C, D and E only
Ans: 2
 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram