అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

వైద్యరంగంలో డాక్టర్లతోపాటు నర్సులూ ముఖ్య భాగంగా ఉంటారు. వైద్యులు వ్యాధిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తారు. నర్సులు రోగిని కనిపెట్టుకుని ఉండి, సరైన విధంగా చికిత్స అందేలా చూస్తారు. వ్యక్తుల శ్రేయస్సును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తూ, ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా నిలుస్తారు. వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (International Nurses Day) నిర్వహిస్తారు. వైద్యులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో వారు చేస్తోన్న కృషి, అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌

  • ‘మదర్‌ ఆఫ్‌ మోడ్రన్‌ నర్సింగ్‌’గా పేర్కొనే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 1820, మే 12న ఇటలీలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు తోటివారికి సేవ చేయాలనే భావన ఎక్కువగా ఉండేది.
  • దీంతో ఆ కాలంలో నర్సింగ్‌ వృత్తికి పెద్దగా ఆదరణ లేకున్నా ఆమె నర్స్‌ కావాలని భావించారు. జర్మనీలోని పాస్టర్‌ థియోడర్‌ ఫ్లీడ్నర్‌కు చెందిన లూథరన్‌ డీకన్‌ శిక్షణా పాఠశాల - ఆసుపత్రిలో మూడు నెలల పాటు నర్సింగ్‌ విద్య అభ్యసించారు.  
  • ఆమె 1853లో లండన్‌లోని ‘జెంటిల్మెన్స్‌ ఆసుపత్రి’లో మేనేజర్‌గా నియమితులయ్యారు.
  • 1854లో జరిగిన క్రిమియన్‌ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ ఏకమై రష్యాకు వ్యతిరేకంగా పోరాడాయి. ఇందులో గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ఫ్లోరెన్స్‌ అక్కడి సైనిక శిబిరాలకు వెళ్లారు. ఎంతోమందిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.
  • రాత్రి సమయంలోనూ ఆమె దీపం పట్టుకుని సైనిక శిబిరాలకు వెళ్లి క్షతగాత్రులకు సాయం చేసేది. ఈ కారణంగానే ఆమెను ‘లేడీ విత్‌ ది ల్యాంప్‌’ అనే పేరుతో పిలుస్తారు.
  • వ్యాధి నివారణకు ఔషధమే కాదు, నర్సులు అందించే సేవ కూడా ముఖ్యమే అనేది ఆమె సిద్ధాంతం.  
నర్సింగ్‌ చరిత్ర, ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చేసిన సేవ, ప్రపంచ నర్సింగ్‌ స్థితి 2025 నివేదిక విశేషాలు, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ తదితర పోటీ పరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే జీకే, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

 గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(యూపీ ఎన్‌హెచ్‌ఎం స్టాఫ్‌ నర్స్, 2021), (ఆర్‌ఆర్‌బీ జేపీఆర్‌ స్టాఫ్‌ నర్స్, 2018)

1) మే 12   2) మే 16

3) మే 18   4) మే 20

సమాధానం: 1

2. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఎప్పుడు జన్మించారు?

(బీహెచ్‌యూ స్టాఫ్‌ నర్స్, 2019)

1) 1820, మే 12    2) 1820, మే 20

3) 1820, జూన్‌ 14  4) 1820, జూన్‌ 12

సమాధానం: 1

3. The birth anniversary of ________ is celebrated as 'International Nurses Day' every year.
(SSC CGL 2020)
1) Mother Teresa                2) Clara Barton
3) Alice Walker                4) Florence Nightingale
Ans: 4
4. Nursing has a code of ethics that professional registered nurses follow and:
(AIIMS Nursing Officer Nagpur 2020)
1) Protects the client from harm
2) Ensures identical care to all clients
3) Defines the principles by which nurses provide care to their clients
4) Improves self-health care
Ans: 3
5. The theme for International Nurses Day 2025 was;
(GMCH Nursing 2025)
1) Our Nurses. Our Future. Caring Nurses Strengthens economies
2) Nursing Power to Change the World!
3) Our Nurses. Our Future
4) Nurses; A voice to lead - Invest in Nursing and Respect Rights to secure global health
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram