జాతీయ సాంకేతిక దినోత్సవం

జాతీయ సాంకేతిక దినోత్సవం

మానవ దైనందిన జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారింది. ఏదో ఒక రూపంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశాభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎప్పటికప్పుడు కొత్తతరం టెక్నాలజీలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. రక్షణ, విద్య, ఆరోగ్యం, పరిపాలన మొదలైన రంగాలన్నింటిలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పోఖ్రాన్‌ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా (National Technology Day) నిర్వహిస్తారు. భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల శాస్త్ర - సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • భారతదేశం టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సాంకేతిక పెట్టుబడులకు అత్యంత అనుకూల దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. అంతరిక్ష రంగ పరిశోధనల్లో అగ్రగామి అయిదు దేశాల్లో (అమెరికా, చైనా, రష్యా, భారత్, జపాన్‌) భారత్‌ ఒకటి.
  • సాంకేతిక అభివృద్ధి పరంగా వివిధ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఇటీవలి కాలంలో ప్రచురించిన నివేదికల్లో భారత్‌ ప్రపంచ దేశాలతో పోటీపడి ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది.  
  • స్వాతంత్య్రానంతరం దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు వెనుకబడి ఉన్నాయని అప్పటి పాలకులు గుర్తించారు. వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తూ, పాలసీలకు రూపకల్పన చేశారు.
  • అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1958లో మొదటి ‘‘శాస్త్ర సాంకేతిక పాలసీకి(Science and Technology Policy) రూపకల్పన చేసింది. కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని తీసుకొచ్చారు. 

చారిత్రక నేపథ్యం:

1998, మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్‌ విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించింది. ‘ఆపరేషన్‌ శక్తి’గా పేర్కొనే ఈ మిషన్‌ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పరీక్ష విజయవంతమయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషిని అభినందించడంతోపాటు శాస్త్ర, సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఏటా మే 11న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ నవకల్పన సూచిక - 2025, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ రిపోర్ట్‌ 2025, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు - పాలసీలతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్స్, స్టాఫ్‌ సెలక్షన్, యూజీసీ నెట్‌ తదితర పోటీ పరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే జీకే, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎన్‌బీసీసీ జేఈ సివిల్, 2022),

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ (ఆర్‌ఐ, ఏఆర్‌ఐ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌) ప్రిలిమ్స్, 2025),

(సీఎస్‌ఐఆర్‌-సీఎల్‌ఆర్‌ఐ జేఎస్‌ఏ, 2024)

1) జనవరి 21   2) మే 11

3) జూన్‌ 11     4) డిసెంబరు 13

సమాధానం: 2

2. 1998లో పోఖ్రాన్‌లో జరిపిన అణు పరీక్ష సంకేత నామం?

(ఎన్‌టీపీసీ, 2021),

1) లాఫింగ్‌ బుద్ధ           2) స్మైలింగ్‌ బుద్ధ

3) ఆపరేషన్‌ రిసెర్చ్‌         4) ఆపరేషన్‌ శక్తి

సమాధానం: 4

3. Defence Research and Development Organization (DRDO) was established in the year
(UPSSSC PET 2025),
(SSC CHSL Exam 2023),
(NTPC CBT-I 2021)

1) 1962        2) 1968        3) 1958        4) 1972

Ans: 3 

4. Consider the following statements with regard to National Technology Day :
I. It commemorates the momentous events of 11th May 1998, when India conducted successful nuclear tests under Operation Shakti
II. The official theme for National Technology Day 2025 is ‘School  to Startups — Igniting Young Minds to Innovate’
Which of the statements given above is/are correct ? 
(NDA-II 2025)
1) I only        2) II only         3) Both I and II         4) Neither I nor II 
Ans: 1 
5. What was India’s rank in the Global Innovation Index 2024?
(SSC CHSL 2025)
1) 46th        2) 19th        3) 61st        4) 39th
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram