ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం

ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం

రెడ్‌ క్రాస్‌ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ప్రజల జీవనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటం అనే ఏకైక లక్ష్యంతో ఇది పని చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైనవారికి ఇది సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ (ఐసీఆర్‌సీ) సహవ్యవస్థాపకులైన హెన్రీ డునాంట్‌ జయంతి సందర్భంగా ఏటా మే 8న ‘ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం’గా (World Red Cross Day) నిర్వహిస్తారు. దీన్నే ‘రెడ్‌ క్రెసెంట్‌ డే’ అని కూడా అంటారు. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, అవిశ్రాంతంగా పనిచేసే స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది, మద్దతుదారులను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ (ఐసీఆర్‌సీ)

  • ఇది స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ. మానవ బాధలు తగ్గించడం, గౌరవాన్ని నిలబెట్టడం; సాయుధ పోరాటాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడటం దీని లక్ష్యం.
  • అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ - రెడ్‌ క్రిసెంట్‌ ఉద్యమంలో ఇది అత్యంత పురాతన, విస్తృత గుర్తింపు పొందిన సభ్య సంస్థ.  

చిహ్నం..

  • 1864లో జరిగిన ఐసీఆర్‌సీ దౌత్య సమావేశంలో యుద్ధ క్షేత్రంలో సహాయ కార్యకలాపాలు నిర్వహించే వైద్య సిబ్బందిని, సౌకర్యాలను రక్షించేందుకు ఒక స్పష్టమైన చిహ్నం అవసరమని నిర్ణయించారు. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎర్రటి శిలువ గుర్తును రెడ్‌ క్రాస్‌ లోగోగా ఎంపిక చేశారు. స్విట్జర్లాండ్‌ జాతీయ జెండా ఎర్రటి నేపథ్యంలో తెలుపు రంగు శిలువ ఉంటుంది, సరిగ్గా దీనికి వ్యతిరేకంగా లోగోను ఎంచుకున్నారు.
  • 1929 జెనీవా ఒప్పందంలో క్రాస్, క్రిసెంట్‌ చిహ్నాలను లిఖితపూర్వకంగా చేర్చారు. ఐసీఆర్‌సీ చిహ్నంగా రెడ్‌ క్రాస్‌ను ఎంచుకున్నారు.
  • 2005, నవంబరులో జెనీవాలో జరిగిన జనరల్‌ అసెంబ్లీ, కౌన్సిల్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌ సమావేశంలో రెడ్‌ క్రాస్‌ - రెడ్‌ క్రిసెంట్‌ ఉద్యమానికి కొత్త చిహ్నంగా ‘రెడ్‌ క్రిస్టల్‌’ (ఎర్ర స్ఫటికం)ను ఎంపిక చేశారు. 

రెడ్‌క్రాస్‌ ఏర్పాటుకు దారితీసిన కారణాలు, ఐసీఆర్‌సీ ఏయే సంవత్సరాల్లో నోబెల్‌ గెలుచుకుంది, అది పాటించే సప్త సూత్రాలు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తదితర అంశాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సులో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ (ఐసీఆర్‌సీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(పీఎస్‌పీసీఎల్‌ జేఈ ఈఈ, 2018)

1) జెనీవా            2) న్యూయార్క్‌

3) మాడ్రిడ్‌           4) హేగ్‌

సమాధానం: 1

2. ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎంపీ పట్వారీ, 2017), (ఇండియన్‌ ఆర్మీ నర్సింగ్‌ అసిస్టెంట్‌ (టెక్నికల్‌), 2020),

(ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్, 2018), (ఎంపీ కోపరేటివ్‌ సొసైటీ మేనేజర్, 2023),

(పీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2024), (డబ్ల్యూబీసీఎస్‌ మెయిన్స్, 2021),

1) మే 8    2) మే 9

3) మే 7    4) మే 5

సమాధానం: 1

3. Whose birth anniversary is celebrated as World Red Cross Day?
(OSSC CGL 2022)
1) Sarojini Naidu                2) Mahatma Gandhi
3) Florence Nightingale            4) Jean - Henry Dunant
Ans: 4
4. Which of the following are not correct?
I. Human Rights Day and 10th December
II. World Red Cross Day and 8th May
III. World Environment Day and 11th December
IV. World AIDS Day and 5th June 
(UPPSC LT Grade Assistant Teacher 2018)
1) III and IV only        2) I and IV only        
3) II and III only        4) I and II only
Ans: 1
5. Below are some important events and dates, which were celebrated in 2018. Which of the following is not a correct match?
(UPSSSC VDO 2018)
1) World Red Cross Day: 8, March
2) Goa Revolution Day (GRD): 18, June
3) World Day Against Child Labor: 12, June
4) When is the first World Bicycle Day (WBD) celebrated by the United Nations (UN): 3, June
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram