బీఆర్‌ఓ వ్యవస్థాపక దినోత్సవం

బీఆర్‌ఓ వ్యవస్థాపక దినోత్సవం

భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానానికి కృషి చేసే ప్రభుత్వ రంగ సంస్థ బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ). ఇది దేశ రక్షణ రంగానికి గణనీయమైన సహాయాన్ని అందిస్తోంది. అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాలకు సైతం సాయుధ దళాలు చేరుకునేలా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, ఎయిర్‌ ఫీల్డ్స్, మెరైన్‌ వర్క్‌లను నిర్మించడంతోపాటు, నిర్వహించడం బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రత్యేకత. బీఆర్‌ఓ స్థాపనకు గుర్తుగా ఏటా మన దేశంలో మే 7న బీఆర్‌ఓ వ్యవస్థాపక దినోత్సవాన్ని (BRO Raising Day) నిర్వహిస్తారు. దేశ రక్షణలో బీఆర్‌ఓ పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

లక్ష్యాలు - ఉద్దేశాలు..

  • నిబద్ధత, అంకితభావం, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, నిర్వహించడం ద్వారా సాయుధ దళాల వ్యూహాత్మక అవసరాలు తీర్చడంలో సాయం చేయడం.
  • తక్కువ మొత్తంతోనే విస్తృత శ్రేణి నిర్మాణ కార్యకలాపాలతో అంతర్జాతీయ స్థాయి నాణ్యతను సాధించడం; సకాలంలో పూర్తి చేయడం.
  • నిర్మాణ కార్యకలాపాల్లో అత్యున్నత స్థాయి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని నిర్ధారించడానికి ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టి సారించడం,.
  • సమాజం సాధారణ జీవన నాణ్యత, అభివృద్ధిని మెరుగుపరచడానికి దోహదపడటం.
  • దేశ సరిహద్దు ప్రాంతాల్లో, భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు నడిపే పొరుగు దేశాల్లో రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, నిర్వహించడం.

చారిత్రక నేపథ్యం

దేశంలోని ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1960, మే 7న బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ)ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఏటా ఆ తేదీన బీఆర్‌ఓ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

బీఆర్‌ఓకి సంబంధించిన గణాంకాలు, కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు, పొరుగు దేశాల్లో బీఆర్‌ఓ చేపట్టిన కార్యక్రమాలు, మన దేశంలో పలు ప్రాజెక్టుల కింద పూర్తి చేసిన నిర్మాణాలు సహా ఈ అంశంపై ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ క్లర్క్స్‌ మెయిన్స్, ఐబీబీపీఎస్‌ క్లర్క్స్‌ మెయిన్స్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో సహా రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన టాపిక్స్‌పై ఈబుక్స్, మంత్లీ కరెంట్‌ అఫైర్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. బీఆర్‌ఓ పూర్తి రూపం ఏమిటి?

(ఏఏఐ ఏటీసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, 2021)

1) బోర్డర్‌ రోడ్‌ ఆఫీస్‌

2) బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌

3) బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌

4) బోర్డర్‌ రివర్‌ ఆర్గనైజేషన్‌

సమాధానం: 3

2.బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ)ను ఏ సంవత్సరంలో స్థాపించారు?

(బిహార్‌ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, 2022), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022),

(బిహార్‌ టీఆర్‌ఈ 2.0 టీజీటీ (సోషల్‌ సైన్స్‌), 2023), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ హెడ్‌ క్లర్క్, 2022), (యూకేఎస్‌ఎస్‌సీ డ్రాఫ్టర్, 2017), (ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2024),

(ఏడబ్ల్యూఈఎస్‌ పీజీటీ (జాగ్రఫీ), 2012),  (టీఎన్‌టెట్‌ (సోషల్‌ స్టడీస్‌), 2019)

1) 1950   2) 1960        3) 1970   4) 1948

సమాధానం: 2

3. The Border Roads Organization was established in the year ________ for the development of roads of strategic importance in the ______ region.
(ICAR Technician, 2022)
1) 1960; Northern and North western
2) 1960; Northern and North eastern
3) 1961; Eastern and North eastern
4) 1961; Western and North western
Ans: 2
4. Which of the following organisations has constructed roads in high altitude mountainous terrain joining Chandigarh with Manali (Himachal Pradesh) and Leh (Ladakh)?
(RPF Constable 2025)
1) Border Roads Organisation (BRO)
2) National Highways Authority of India (NHAI)
3) National Highways and Infrastructure Development Corporation Limited (NHIDCL)
4) Central Industrial Security Force (CISF)
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram