బొగ్గు గని కార్మికుల దినోత్సవం

బొగ్గు గని కార్మికుల దినోత్సవం

ప్రకృతిలో లభించే అత్యంత ముఖ్యమైన శిలాజ ఇంధనాల్లో బొగ్గు ఒకటి. ఇదొక ఇంధన ఖనిజం. దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారు. విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం దీన్ని విరివిగా వినియోగిస్తారు. భూమిలో నుంచి దీన్ని వెలికితీయడం శ్రమతో పాటు ప్రమాదకరం కూడా. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కృషిని, అంకితభావాన్ని గుర్తించాలనే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఏప్రిల్‌ 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవం (Coal Miners Day)గా నిర్వహిస్తారు. బొగ్గును అందుబాటులోకి తెస్తోన్న కార్మికుల శ్రమను గుర్తుంచుకోవడంతోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్రను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం..

దేశంలో మొదటి భూగర్భ బొగ్గు గనిని పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో 1907, మే 4న ప్రారంభించారు. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘బొగ్గు గని కార్మికుల దినోత్సవం’ జరుపుకోవాలని 2017లో ప్రభుత్వం తీర్మానించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram