దేశంలో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. 2021-23 మధ్య ఆరు రాష్ట్రాల్లో తూనీగలు, నీటి తూనీగలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. దాదాపు 143 జాతుల తూనీగలకు నిలయమైన పశ్చిమ కనుమల్లో ఇప్పుడు కనీసం 79 జాతులు కనిపించడం లేదని అధ్యయనంలో తేలింది. వీటి సంఖ్యలో దాదాపు 35% తగ్గుదల నమోదైంది.