2026 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన బ్రాండ్ స్ట్రెంథ్ సూచీలో దేశీయ బుల్లెట్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ మూడో స్థానంలో నిలిచింది. ఇది 100 పాయింట్లకు 88.6 పాయింట్ల స్కోర్, ఏఏఏ రేటింగ్‌ను సాధించింది. టయోటా, బీఎండబ్ల్యూలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆడికి నాలుగో స్థానం, ఫెరారీకి ఏడో స్థానం లభించింది.
భారత్‌కు చెందిన టాటా మోటార్స్ బ్రాండు అయిదో స్థానంలో నిలవగా.. మారుతీ సుజుకీ 6వ ర్యాంకును, మహీంద్రా అండ్ మహీంద్రా 8వ ర్యాంకును, హీరో మోటోకార్ప్ 10వ ర్యాంకును పొందాయి.