నీతి ఆయోగ్‌ నివేదిక

నీతి ఆయోగ్‌ నివేదిక

దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ పదేళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. దిల్లీ, చండీగఢ్‌లలో పదో తరగతి పూర్తి చేసిన వారందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ఇది అండమాన్, నికోబార్‌ దీవుల్లో 92.5%, దాద్రానగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ 91.4%, లక్షద్వీప్‌ 91.3% కేరళ 90.2%, పంజాబ్‌ 90.7%, పుదుచ్చేరి 90.1%, గోవా 90.9%గా ఉంది. 2014-15లో ఏపీలో ఈ మార్పు రేటు 40.79% ఉండగా 76%కి పెరిగింది. జాతీయ సగటు (75.1%) కంటే ఎక్కువగా ఉన్నా 24% మంది చదువు మానేయడం ఆందోళనకరమే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram