దేశంలో అసంఘటిత పరిశ్రమలు 7.92 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది. 2023 అక్టోబరు-2024 మధ్యలో నిర్వహించిన సర్వేలో 7.34 కోట్ల మేర ఉన్న ఈ పరిశ్రమల సంఖ్య 2025 జనవరి-డిసెంబరు మధ్యకాలం నాటికి 7.97% పెరిగి 7.92 కోట్లకు చేరినట్లు 2026, మే 6న విడుదల చేసిన అసంఘటిత రంగ పరిశ్రమల వార్షిక సర్వే (యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ ఇన్‌కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ - ఏఎస్‌యూఎంఈ)లో పేర్కొంది.
మొత్తం పరిశ్రమల్లో దాదాపు 26% రిటైల్ ట్రేడ్, 12% అపెరల్, మరో 12% సామాజిక, వ్యక్తిగత సేవల్లో ఉన్నాయి.