ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది దేశం కాని దేశంలో ప్రవాసులుగా నివసిస్తున్నారని ప్రపంచ వలసల నివేదిక-2026 వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దీన్ని విడుదల చేసింది. అత్యధిక వలసలు నమోదవుతున్న పది ప్రాంతాల జాబితాలో భారత్-యూఏఈ, భారత్-అమెరికా ఉన్నాయని 2024 నాటి గణాంకాలు తెలియజేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.
ప్రపంచ జనాభాలో వలసదారుల వృద్ధి 1990లో 2.9 శాతం ఉండగా, 2024 నాటికి అది 3.7 శాతానికి పెరిగిందని వివరించింది.