జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్లైమేట్ యాక్షన్, ఆత్మనిర్భర్ విభాగాల్లో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీలు అవార్డులు సాధించాయి. క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది.