అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు

అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు
  • కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ, మహిళా మిత్ర విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలానికి చెందిన బొక్కసంపాలెంలు తొలి ర్యాంకుల్లో నిలిచి రూ.కోటి చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నాయి.
  • పేదరిక నిర్మూలన-మెరుగైన జీవనోపాధుల విభాగంలో వైఎస్సార్‌ కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన చెముళ్లపల్లి రెండో ర్యాంకు సాధించి రూ.75 లక్షలు; స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల మూడో ర్యాంకులో నిలిచి రూ.25 లక్షల ప్రైజ్‌మనీ సాధించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram