ఎన్‌సీఆర్‌బీ-2024 వార్షిక నివేదిక

ఎన్‌సీఆర్‌బీ-2024 వార్షిక నివేదిక
  • ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగినట్లు  ‘జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక- 2024’ వెల్లడించింది. వాటిల్లోనూ ప్రధానంగా తీవ్ర గాయాలు పాలయ్యేలా దాడులు (గ్రీవియస్‌ హర్ట్‌) చేసే ఘటనలు ఎక్కువైనట్లు తెలిపింది. హింసాత్మక నేరాలకు సంబంధించి 2022లో 7,104, 2023లో 6,432 కేసులు నమోదు కాగా... 2024లో ఆ సంఖ్య ఏకంగా 27,443కు ఎగబాకింది.
  • మహిళలను వేధించటంలో మూడో స్థానంలో, రహస్యంగా మహిళల దృశ్యాల చిత్రీకరణ నేరాల్లో నాలుగో స్థానంలో ఏపీ ఉంది. భర్త, బంధువుల క్రూరత్వం బారిన పడిన ఘటనల్లో మన రాష్ట్రానిది ఆరో స్థానం. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత ఏపీ మూడో స్థానంలో ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram