తలసరి ఆదాయంలో విశాఖ టాప్‌

తలసరి ఆదాయంలో విశాఖ టాప్‌
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,58,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా రూ.1,56,875తో చివరిలో ఉంది. 2026, మే 7న జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రణాళిక శాఖ అధికారులు ఆయా వివరాలను వెల్లడించారు. రాష్ట్రం 2025-26లో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించారు. దేశ సగటు కంటే ఇది ఎక్కువ. రూ.17.62 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు.
  • తలసరి ఆదాయంలో ముందున్న అయిదు జిల్లాలు: విశాఖపట్నం - రూ.6,58,964; కృష్ణా    - రూ.4,81,878; ఎన్టీఆర్‌     - రూ.3,91,274; ఏలూరు - రూ.3,76,992; తిరుపతి - రూ.3,53,510.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram