‘పిల్లలే సంపద’

‘పిల్లలే సంపద’
  • ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా ఎదురవుతోన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం మే నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం ‘పిల్లలే సంపద’ గ్రామసభలు నిర్వహించనుంది. జనాభా సంఖ్యను నియంత్రించడం కంటే.. ప్రజల ఆరోగ్యం, కుటుంబ భద్రత, జీవన ప్రమాణాల మెరుగుపై దృష్టి పెడితే.. ఆరోగ్యాంధ్ర సాకారమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
  • ఈ దిశగా కీలక ప్రణాళికలతో ఆరోగ్యాంధ్ర పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.782.25 కోట్ల నిధులతో ప్రణాళికలను పట్టాలెక్కించనుంది. ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘పిల్లలే సంపద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram