హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) ఈ నిధులను మంజూరు చేసింది. ధ్రువ స్పేస్ ‘ప్రాజెక్ట్ గరుడ్’కు ఈ నిధులు అందుతాయి. ఈ ప్రాజెక్టు కింద భారీ సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు 500 కిలోల విభాగంలో ప్రామాణీకరించిన ప్లాట్‌ఫామ్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది.