ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్‌బీలు లాభాల్లో ముగించాయి.
2025-26 పీఎస్‌బీల నిర్వహణ లాభం రూ.3.21 లక్షల కోట్లకు చేరగా.. 2024-25తో పోలిస్తే నికర లాభం 11.1% పెరిగి రూ.1.98 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యాపారం 12.8% వృద్ధితో రూ.283.30 లక్షల కోట్లకు చేరింది.
డిపాజిట్లు 10.6% అధికమై రూ.156.3 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.