ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్‌తో భేటీ అయ్యారు. పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం తదితర రంగాల్లో రెండు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.