భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త ఘనతను సాధించింది. తాజాగా ఈ సంస్థ రూ.565 కోట్లు (60 మిలియన్ డాలర్లు) సమీకరించి, ‘యూనికార్న్’ (100 బిలియన్ డాలర్లు/రూ.9,400 కోట్లకు పైగా విలువైన సంస్థ) హోదాను సొంతం చేసుకుంది. తాజా పెట్టుబడి తర్వాత కంపెనీ విలువ రూ.10,360 కోట్ల (1.1 బిలియన్ డాలర్ల)కు చేరుకుంది. భారత అంతరిక్ష రంగంలో యూనికార్న్ స్థాయికి చేరిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది.