భారత్, వియత్నాం దేశాలు తమ మధ్య ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఇరుదేశాలూ అవగాహనకు వచ్చాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలూ 2026, మే 6న 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందాలు డిజిటల్ చెల్లింపులు, అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సంస్కృతి సహా పలు ఇతర రంగాలలో సంబంధాలు సుదృఢం చేసేందుకు అవకాశం కల్పించనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.