ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది. ఇంతకు ముందు జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా సంస్థ అంచనా వేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అత్యంత కీలకమని తెలిపింది. ‘ఇండియా ఫార్వర్డ్’ పేరిట ఎస్ అండ్ పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్త నివేదికను వెలువరించాయి.