నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.23.40 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12% వృద్ధితో రూ.23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం సవరించిన అంచనా అయిన రూ.24.21 లక్షల కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. 2024-25లో ఇవి రూ.22.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గణాంకాల ప్రకారం.. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.99 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను (ఎస్‌టీటీతో కలిపి) రూ.12.41 లక్షల కోట్లు వసూలయ్యాయి.