జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్‌జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని మొదట భావించినా.. పరిపాలన, సాంకేతిక కారణాలతో జూన్ ఆఖరు వరకు నరేగానే కొనసాగించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను గమనిస్తే..
ఆంధ్రప్రదేశ్..
ఆంధ్రప్రదేశ్‌లో 2026, జులై 1 నుంచి రూ.7,973 కోట్లతో వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్-గ్రామీణ్) పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో కేంద్ర వాటా రూ.4,784 కోట్లు (60%), రాష్ట్ర వాటా రూ.3,189 కోట్లు (40%).
తెలంగాణ..
వీబీ జీరామ్‌జీ అమలు వల్ల తెలంగాణపై ఏటా రూ.2 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో వేతనాలు, పరిపాలన వ్యయం మొత్తం కేంద్రమే భరించేది. సామగ్రి వాటాలో 75% ఇస్తే మిగిలిన 25% వాటా రాష్ట్రానిదిగా ఉండేది. జులై నుంచి వేతనాలు, సామగ్రి వాటాలో 60% వాటానే కేంద్రం భరించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై మిగిలిన భారంపడనుంది.