తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు.
విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎస్.కీర్తన, ఎన్.ఆనంద్, ఆదవ్ ఆర్జున, కె.జి.అరుణ్‌రాజ్, కె.ఎ.సెంగోట్టైయన్, రాజమోహన్, సీటీఆర్ నిర్మల్‌కుమార్, పి.వెంకట రమణన్, టి.కె.ప్రభు ఉన్నారు.