దాదాపు అయిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లను పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌లు కార్మికులందరికీ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. వేతన కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రత కోడ్-2020, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్-2020 పేరుతో ప్రభుత్వం ఈ కార్మిక నియమాలను అమల్లోకి తెచ్చింది. గతంలోని 29 కార్మిక చట్టాలను ‘ఆధునికీకరించి’ వాటిని 4 కోడ్‌లుగా కుదించింది.
2025, నవంబరు 21న ఈ కోడ్‌లు చట్టరూపు దాల్చాయి. డిసెంబరు 30న ముసాయిదా నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం తాజాగా లేబర్ కోడ్‌లపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.