‘జనని’ ప్లాట్‌ఫామ్‌

‘జనని’ ప్లాట్‌ఫామ్‌
  • గర్భధారణ, గర్భకాల, ప్రసవానంతర దశల్లో మాతృమూర్తులు, నవజాత శిశువుల ఆరోగ్యం పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జనని (జర్నీ ఆఫ్‌ యాంటీనాటల్, నాటల్, నియోనాటల్‌ ఇంటిగ్రేటెడ్‌ కేర్‌)పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మాతృమూర్తులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
  • ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తారు. దానివల్ల తల్లిబిడ్డల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వీలవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 2026, మే 7న తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram