వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనివల్ల జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందేమాతరానికీ రాజ్యాంగ రక్షణ లభించనుంది. ప్రస్తుత చట్టం.. జాతీయ గీతం, జాతీయ జెండా, రాజ్యాంగానికే ఈ రక్షణ కల్పిస్తోంది.