సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంపు

సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంపు
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో 2026, మే 5న భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.
  • ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92వేల కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు వేగంగా న్యాయసేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ పెంపునకు ఆమోదముద్ర వేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram