ఎన్నికల ఫలితాలు

ఎన్నికల ఫలితాలు
  • దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026, మే 4న వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌ను భాజపా భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతి పెద్ద పార్టీగా అవతరించింది. కేరళంలో యూడీఎఫ్‌ జయకేతనం ఎగురవేసింది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన భాజపా ఐదింట నాలుగొంతుల మెజారిటీ సాధించింది. పుదుచ్చేరిలో రంగసామి నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ అధికారం నిలబెట్టుకుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ తాము పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 
  • కేరళంలో ఓటమితో ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లెఫ్ట్‌కు అధికారం లేకుండా పోయింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత లెఫ్ట్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది.
  • ముగ్గురు ముఖ్యమంత్రులు (స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీ) పదవులను కోల్పోతున్నారు. ఇద్దరు (హిమంత బిశ్వశర్మ, రంగసామి) నిలబెట్టుకున్నారు.
  • పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించడంతో దేశంలో ఎన్డీయే పాలనలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి పెరిగింది. బెంగాల్‌ విజయంతో భాజపా స్వతంత్రంగా పాలించే రాష్ట్రాలు 15కు చేరనున్నాయి. అదనంగా బిహార్‌లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా-జనసేన, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్, మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ తదితరాలతో కలిపి భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి చేరింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram