ప్రయాగ్‌రాజ్‌లో సరస్వతి నది ఆనవాళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో సరస్వతి నది ఆనవాళ్లు
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగ, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ పురాతన నది ప్రవహించిన ఆనవాళ్లను హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంద్ర భూగర్భజలాల బోర్డు(సీజీడబ్ల్యూబీ) సహకారంతో చేపట్టిన అధ్యయనంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
  • గంగ, యమున, సరస్వతి నదుల కలయికే త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రసిద్ధి. కానీ సరస్వతి నదిని మాత్రం ఎవరూ చూడలేదు. పురాణ గ్రంథాల్లో ప్రస్తావనల ఆధారంగా ప్రజల్లో నెలకొన్న విశ్వాసం మాత్రమే. ఇప్పుడు ఆ నమ్మకానికి శాస్త్రీయ బలం చేకూరింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram