త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి

త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
  • త్రిదళాధిపతిగా (సీడీఎస్‌) విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌.ఎస్‌.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ 2026, మే 9న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్, చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరొందిన సుబ్రమణి.. సీడీఎస్‌ బాధ్యతలతోపాటు రక్షణ మంత్రిత్వశాఖలోని సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగానూ విధులు నిర్వహిస్తారు.
  • 2025, జులై 31న వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ హోదాలో పదవీ విరమణ చేసిన ఆయన.. ప్రస్తుతం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌కు సైనిక సలహాదారుగా ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram